చంచల్‌గూడ జైలు నుంచి అల్లు అర్జున్‌ విడుదల విడుదల అయ్యారు. ఉదయం ఆరు గంటల తర్వాత చంచల్‌గూడ జైలు వెనుక గేటు నుంచి అల్లు అర్జున్‌ను జైలు అధికారులు ఇంటికి పంపించారు. ఓ ఎస్కార్ట్‌ వాహనం ద్వారా జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి అల్లు అర్జున్‌ను చంచల్‌గూడ పోలీసులు పంపించారు.

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో నిన్న అల్లు అర్జున్‌ అరెస్టు అయిన సంగతి తెలిసిందే. నిన్న నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌కు 14 రోజులు రిమాండ్‌ విధించింది. అయితే.. రిమాండ్ విధించిన కొన్ని గంటలకే హైకోర్టులో అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్‌ లభించింది. అయితే అప్పటికే రిమాండ్‌ కోసం జైలుకు అల్లు అర్జున్‌ను తరలించారు. అలాగే జైలు విడుదల ప్రక్రియ ఆలస్యం కావడంతో మధ్యంతర బెయిల్‌ వచ్చినా అల్లు అర్జున్ రాత్రంతా జైలులోనే ఉండాల్సి వచ్చింది. విడుదల ప్రక్రియ ఆలస్యం కావడంతో ఇవాళ అల్లు అర్జున్ విడుదలయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: