అల్లు అర్జున్‌ అరెస్టు జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన నేపథ్యంలో ఆయన అరెస్టుపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అల్లు అర్జున్‌ తనకు చిన్నప్పట్నుంచి తెలుసని... కావాలని అల్లు అర్జున్‌ను ఎందుకు అరెస్ట్‌ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అంతే కాదు.. అల్లు అర్జున్‌ తమకు బంధువు కూడా అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి.

అల్లు అర్జున్‌ సతీమణి కుటుంబం మాకు బంధువులవుతారని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు. అల్లు అర్జున్‌ సతీమణి స్నేహా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారని తెలిసిందే. అలాగే.. అల్లు అర్జున్‌ మేనమామ చిరంజీవి కూడా కాంగ్రెస్‌ నేతేనని రేవంత్ రెడ్డి అన్నారు. అంతే కాదు.. అల్లు అర్జున్  సొంతమామ చంద్రశేఖర్‌ రెడ్డి కూడా కాంగ్రెస్‌లోనే ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. పోలీసులు చేయాల్సిన పని వాళ్లు చేస్తారని... లా అండ్‌ ఆర్డర్‌ ప్రకారం నడుచుకుంటారని రేవంత్ రెడ్డి అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: