గత ఎన్నికల్లో ఘోర పరాజయంతో అధికారానికి దూరమైన వైసీపీ అధినేత జగన్ పార్టీ బలోపేతంపై దృష్టిసారించారు. పార్టీ పదవుల నియామకంపై ఫోకస్ పెట్టిన జగన్.. వరుసగా నియామకాలను చేపడుతున్నారు. తాజాగా లక్ష్మీపార్వతిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ అంశంపై ఏపీ పాలిటిక్స్ లో ఆసక్తికర అంశంగా మారింది.



చంద్రబాబు కుటుంబాన్ని టార్గెట్ చేయడమే లక్ష్యంగా జగన్ ఈ నియామకం చేసినట్లు తెలుస్తోంది.  2019 ఎన్నికల ముందు సైతం లక్ష్మీపార్వతి వైసీపీలో కీలక పాత్ర పోషించారు. అవకాశం వచ్చినప్పుడల్లా చంద్రబాబు ఫ్యామిలీపై నిప్పులు చెరిగారు.  ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెను తెలుగు అకాడమీ చైర్మన్ గా నామినేటెడ్ పదవిని కట్టబెట్టారు జగన్.


ఆ తర్వాత జిల్లాల పునర్విభజన సమయంలో కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారు. అనంతరం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టారు. ఈ నిర్ణయాన్ని టీడీపీ నేతలు, ఎన్టీఆర్ అభిమానులు వ్యతిరేకించినా.. లక్ష్మీపార్వతి మాత్రం వ్యతిరేకించలేదు.  వైసీపీలోనే కొనసాగారు.  ఈ నేపథ్యంలో మరోసారి ఆమెకు పార్టీలో మరోసారి ప్రాధాన్యత కలిగిన పోస్టును అందించారు.



దీంతో లక్ష్మీపార్వతి మరోసారి వైసీపీలో కీలకం కానున్నారు. ప్రెస్ మీట్లు, టీవీ డిబేట్లు, పార్టీ వేధికలపై చంద్రబాబు ఫ్యామిలీని, టీడీపీ ప్రభుత్వ విధానాలను తూర్పార పట్టడానికి లక్ష్మీపార్వతి సిద్ధం అవుతున్నారన్న చర్చ వైసీపీలో సాగుతోంది. మరికొందరు వైసీపీ నేతలు మాత్రం.. పార్టీలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. యువతకు కాకుండా ఛాన్స్ ఇవ్వకుండా ఇచ్చిన వారికే మళ్లీ ఇవ్వడం సరికాదంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: