ఏపీలో ఓ ప్రాజెక్టు డీపీఆర్‌ మారబోతోంది. ఏలేరు రిజర్వాయర్ ఆధునీకరణ డీపీఆర్ ను రివైజ్ చేస్తామని జిల్లా ఇంఛార్జి మంత్రి నారాయణ డీఆర్సీ సమావేశంలో తెలిపారు. జిల్లా అభివృద్ధి పై డీఆర్సీ సమావేశం లో చర్చించామన్న జిల్లా ఇంఛార్జి మంత్రి నారాయణ రైతులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు సన్నద్ధం అవుతున్నారన్నారు. రాజధానికి 34 వేలు ఎకరాలు  రైతులు ఇస్తే గత ప్రభుత్వం నిర్వీర్వం చేసిందన్న జిల్లా ఇంఛార్జి మంత్రి నారాయణ.. రాజధాని అథారిటీ రేపు కేబినెట్ లో అప్రూవల్ అవుతుందన్నారు.


రాజధాని వల్ల  26 జిల్లాలు అభివృద్ధి జరుగుతుందన్న జిల్లా ఇంఛార్జి మంత్రి నారాయణ.. గత ప్రభుత్వః ఖజానా ఖాళీ చేసి 10  లక్షల కోట్లు అప్పులు చేసిందని తెలిపారు. గత ప్రభుత్వం 3200 కోట్లు మున్సిపల్ నిధులు దారి మళ్లించిందని.. వైయస్సార్సీపీ ప్రభుత్వం  సాగునీటి రంగాన్ని  నిర్వీర్యం చేసిందని జిల్లా ఇంఛార్జి మంత్రి నారాయణ విమర్శించారు.


గత ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం వల్ల అమృత్ భారత్ ప్రాజెక్టు ఆగిపోయిందన్న జిల్లా ఇంఛార్జి మంత్రి నారాయణ...వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి మున్సిపాలిటీలో చెత్త లేకుండా విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

cbn