వనిత ఛానల్ ద్వారా జర్నలిస్టుగా ప్రస్థానం ప్రాంభించిన స్వేచ్ఛ వోటార్కర్ ప్రస్తుతం టీన్యూస్ ఛానల్‌లో స్పెషల్ కరస్పాండెంట్ గా పని చేస్తున్నాను. 17 సంవత్సరాల నుంచి మీడియా రంగంలో ఉన్నారు. వనిత టీవీ, మహా టీవీ, టీవీ9, 10టీవీ, హెచ్ఎంటీవీ, వి6 వంటి ఛానళ్లలో పని చేశారు. ప్రోగ్రామింగ్ తో పాటు స్క్రిప్ట్ రైటర్‌గా పని చేశారు.
సామాజిక సమస్యలపై ఫీల్డ్ రిపోర్టింగ్ కూడా స్వేచ్ఛ వోటార్కర్ చేశారు. రాజకీయ, సామాజిక అంశాలపై రిపోర్టింగ్ తో పాటు న్యూస్ ప్రెజెంటర్ గా పనిచేసిన స్వేచ్ఛ వోటార్కర్.. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా తన వంతు పాత్ర పోషించారు.
జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ మేనేజింగ్ మెంబర్‌గా తనను గెలిపించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపిన స్వేచ్ఛ వోటార్కర్.. పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు వచ్చేందుకు.. వారి సొంతింటి కల నెరవేరేందుకు శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు.