తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయనతో పాటు మాజీ మంత్రి  హరీశ్‌రావు కూడా హైకోర్టుకు వెళ్లారు. తమపై భూపాలపల్లి కోర్టు ఇచ్చిన నోటీసులు కొట్టి వేయాలని కోరుతూ వీరిద్దరూ హైకోర్టులో క్వాష్ పిటిషన్లు వేసుకున్నారు. ఈ పిటిషన్లపై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టే అవకాశం ఉంది.

 హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేసిన కేసీఆర్, హరీశ్‌రావు... భూపాలపల్లి కోర్టు ఇచ్చిన నోటీసులు కొట్టి వేయాలని కోరారు. అసలు విషయం ఏంటంటే.. మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ భూపాలపల్లిలో గతేడాది పిటిషన్ దాఖలైంది. మేడిగడ్డలో ప్రజాధనం వృథా అయిందని రాజలింగమూర్తి అనే వ్యక్తి పిటిషన్ వేశాడు.

మేడిగడ్డ నిర్మాణంలో ప్రమాణాలు పాటించలేదని రాజలింగమూర్తి పిటిషన్ వేశాడు. ఈ ప్రైవేట్‌ పిటిషన్‌పై జులై 10న నోటీసులు భూపాలపల్లి కోర్టు ఇచ్చింది.  రాజలింగమూర్తి పిటిషన్‌ మేరకు కేసీఆర్‌, హరీశ్‌రావు సహా ఆరుగురికి నోటీసులు వచ్చాయి.

ఇప్పుడు ఈ నోటీసులను సవాలు చేస్తూ హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు పిటిషన్లు వేశారు. భూపాలపల్లి కోర్టు ఇచ్చిన నోటీసులు కొట్టివేయాలని క్వాష్ పిటిషన్లు వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr