సీఎం రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకున్నారు. గతంలో కేసీఆర్‌ రద్దు చేసిన రెవెన్యూ పోస్టులను కొత్త పేర్లతో మళ్లీ తీసుకొస్తున్నారు. కేసీఆర్ వీఆర్‌ఓ వ్యవస్థను రద్దు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ బలోపేతానికి సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు.


ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి నియామకం కోసం సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో రద్దు చేసిన వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు.


గత ప్రభుత్వంలో అర్హులైన విఆర్ఓలు ఇతర శాఖలకు బదలాయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వారిని వెనక్కి రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు  తీసుకుంటోంది. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ఇతర శాఖల నుంచి వెనక్కి రప్పించే ప్రక్రియకు సన్నాహాలు జరుగుతున్నాయి.


ఇతర శాఖల్లో పని చేస్తున్న వారిలో ఆసక్తి కలిగిన, అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఈ నెల 28 వ తేదీని గడువు విధిస్తూ సీసీఎల్ ఎ చీఫ్ కమషనర్ నవీన్ మిట్టల్ ఈ మేరకు సర్క్యులర్ ఇచ్చారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: