పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో  ఏర్పడిన అల్ప పీడనం కొనసాగుతోంది. దక్షిణ కోస్తా ఆంధ్ర ,  ఉత్తర తమిళనాడు తీరాలపై కేంద్రీకృతమై ఉన్న అల్ప పీడనం తన ప్రభావం చూపుతోంది.


కొద్ది గంటల్లో  అక్కడే అల్పపీడన ప్రాంతంగా క్రమంగా బలహీనపడే సూచనలు కనిపిస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం చెబుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తర కోస్తాంధ్రలో  తేలికపాటి  నుంచి ఒక   మోస్తరు  వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే  అవకాశం కనిపిస్తోంది.


ఇక దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలోనూ తేలికపాటి  నుండి ఒక మోస్తరు  వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం కనిపిస్తోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలు కూడా ఉన్నాయి. రేపు కూడా తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం చెబుతోంది.


అటు రాయలసీమలో ఇవాళ, రేపు తేలికపాటి  నుండి  ఒక   మోస్తరు  వర్షాలు పడనున్నాయి. అలాగే  కొన్ని చోట్ల  భారీ వర్షాలు  కురిసే  అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం
వివరించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: