ఐసీఏఆర్ - ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్‌గా తెలుగువారైన డాక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఐసీఏఆర్ - నేషనల్ అకాడెమి ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్ - నార్మ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసరావు.. ఐఏఆర్‌ఐ అధిపతిగా ఎంపికైన తొలి తొలుగు శాస్త్రవేత్తగా రికార్డు సృష్టించారు. ఇవాళ దిల్లీలో ఐఏఆర్‌ఐ డైరెక్టర్‌గా శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టనున్నారు.

 

1965 అక్టోబరు 4న ఆంధ్రప్రదేశ్‌ కృష్ణా జిల్లా అనిగండ్లపాడులో జన్మించిన శ్రీనివాసరావు.. 1975-80 వరకు అనిగండ్లపాడు జడ్‌పీహెచ్‌ఎస్‌లో ప్రాధమిక విద్య అభ్యసించారు. జగ్గయ్యపేటలో ఎస్‌జీఎస్‌ పూర్తి చేసి బాపట్లలో వ్యవసాయ కళాశాలలో అగ్రికల్చరల్ బీఎస్‌సీ పట్టా అందుకున్న శ్రీనివాసరావు.. న్యూఢిల్లీ ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్‌లో ఎంఎస్‌సీ, పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఇజ్రాయెల్ టెల్-అవివ్ విశ్వవిద్యాలయంలో పోస్ట్-డాక్టోరల్ చేసిన శ్రీనివాసరావు.. దేశంలో పలు పరిశోధన సంస్థల్లో వివిధ హాదాల్లో పనిచేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: