తెలంగాణ స్పీకర్‌కు హైకోర్టు బిగ్ రిలీఫ్‌ ఇచ్చింది. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు హైకోర్టులో ఊరట లభించింది. 2019లో స్పీకర్ గడ్డం ప్రసాద్‌ పై నమోదైన ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసును హైకోర్టు కొట్టేసింది.


వికారాబాద్‌ ఆర్డీఓ కార్యాలయం ఎదుట 2019లో అనుమతి లేకుండా నిరాహార దీక్ష చేపట్టారని స్పీకర్ గడ్డం ప్రసాద్‌ పై కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో ప్రసాద్‌ కుమార్‌ పేరును పోలీసులు చేర్చారు.

ఇప్పుడు ఈ కేసు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉంది. ఈ  కేసును కొట్టివేయాలని హైకోర్టులో స్పీకర్ గడ్డం ప్రసాద్‌ కుమార్ పిటీషన్‌ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ కేసును కొట్టివేసింది.


కేసు కొట్టి వేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ తీర్పు ఇచ్చారు. దీంతో స్పీకర్ గడ్డం కుమార్‌కు పెద్ద రిలీఫ్‌ దొరికింది. తీర్పు వ్యతిరేకంగా వస్తే రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్నందున ఆయన తలనొప్పిగా మారి ఉండేది.

మరింత సమాచారం తెలుసుకోండి:

hc