రాష్ట్రంలో త్వరలో అమలులోకి రానున్న భూభారతి చట్టం సమర్ధవంతంగా అమలయ్యేట్లు చూడాలని రెవెన్యూ సంఘాల నేతలను సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు.  భూభార‌తి రాక‌తో రాష్ట్రంలోని రైతుల‌కు మెరుగైన రెవెన్యూ సేవ‌లు అందుబాటులోకి వ‌స్తాయ‌ని సీఎం రేవంత్‌ రెడ్డి  అభిప్రాయపడ్డారు. కొత్త చ‌ట్టంతో భూ స‌మ‌స్యల‌కు సైతం ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని  సీఎం రేవంత్‌ రెడ్డి  వివరించారు. ధరణి పోర్టల్‌ కారణంగా రాష్ట్రంలో భూ సమస్యలు పెరిగినట్లు సీఎం రేవంత్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు.


రైతుల‌కు, ప్రజ‌ల‌కు రెవెన్యూ సేవ‌ల‌ను మరింత వేగంగా, సుల‌భంగా అందించే ల‌క్ష్యంతోనే భూభార‌తిని తీసుకొచ్చినట్లు  సీఎం రేవంత్‌ రెడ్డి  వివరించారు. భూ భారతి చట్టంపై క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం జరిగేట్లు చూడాలని  సీఎం రేవంత్‌ రెడ్డి  సూచించారు.


జిల్లా స్థాయిలోనే దాదాపు అన్ని ర‌కాల భూ స‌మ‌స్యల‌కు ప‌రిష్కారం ల‌భించేట్లు కొత్త చ‌ట్టం ఉంద‌ని, రెవెన్యూ అధికారుల‌కు సైతం వివిధ స్థాయిల్లో అధికారాల‌ను కూడా బదలాయించిన విష‌యాన్ని  సీఎం రేవంత్‌ రెడ్డి గుర్తు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: