ప్రభుత్వం టికెట్ ధరలు ఊరికే పెంచడం లేదన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. టికెట్ ధరలు పెంచడం వల్ల టికెట్ పై జీఎస్టీ కడతారని.. ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని అన్నారు. జగన్ ప్రభుత్వం భీమ్లా నాయక్ చిత్రానికి టికెట్ ధరలు పెంచలేదని గుర్తు చేసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ .. చిత్ర పరిశ్రమకు రాజకీయ రంగు పులమడానికి మాకు ఇష్టం లేదన్నారు.
భారతీయ చిత్ర పరిశ్రమ అనేదే మన నినాదమన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్... టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అని కాదు.. మనదంతా ఇండియన్ వుడ్ అన్నారు. హాలీవుడ్ పద్దతులు పాటించకపోయినా వుడ్ మాత్రం తీసుకున్నామని.. మన జాతి ప్రాముఖ్యతను సినిమాల ద్వారా విశ్వానికి చూపించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.