హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతి సోమవారం నగర ప్రజల నుంచి ఫిర్యాదులు, సలహాల స్వీకరించాలని హైడ్రా కమిషనర్ నిర్ణయించారు. ఇకపై ప్రతి సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు హైడ్రా ఫిర్యాదుల స్వీకరిస్తుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.


సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఫిర్యాదుల స్వీకరణ ఉంటుందని హైడ్రా కమిషనర్ తెలిపారు. హైదరాబాద్‌ బుద్ధభవన్ లోని హైడ్రా కార్యాలయంలో ఫిర్యాదులు స్వీకరిస్తారు. అయితే హైడ్రాకు ఫిర్యాదు చేసే ముందు అన్ని ఆధారాలు, పూర్తి వివరాలతో రావాలని హైడ్రా కమిషనర్ సూచించారు. హైదరాబాద్ మాదాపూర్ అయ్యప్పసొసైటీలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు.


అయ్యప్ప సొసైటీలో 684 గజాల స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న భవనాన్ని పరిశీలించారు. జీహెచ్ఎంసీ నోటీసులు, హైకోర్టు ఉత్తర్వులను పాటించకుండా అక్రమంగా భవన నిర్మాణం సాగుతోందని గుర్తించిన రంగనాథ్ అక్రమంగా నిర్మాణం చేపడుతున్న యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: