కాకినాడలో గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత అమ్మోనియా ఉత్పత్తి ప్లాంటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఏడాదికి ఒక మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏయం గ్రీన్ అమ్మోనియా లిమిటెడ్ కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. కాకినాడలో గ్రీన్ కో హైడ్రోజన్ సొల్యూషన్స్ సంస్థకు రెండు గిగావాట్ల ఎలక్ట్రోలైజర్ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చింది.


నంద్యాల, కడప జిల్లాలో 119 మెగావాట్ల పవన , 130 మెగావాట్ల సౌర హైబ్రిడ్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం ఏర్పాటుకు కూడా అనుమతి మంజూరు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ కు అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.


కర్నూలు జిల్లా పత్తికొండ వద్ద 400 మెగావాట్ల టాటా పవర్ ఎనర్జీ లిమిటెడ్ కు అనుమతి మంజూరు చేసింది. రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఈ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులకు ఆమోదం తెలియజేయడంతో ఉత్తర్వులు జారీ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: