జూపార్క్‌ ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంఐఎం నేతలు ఒవైసీ సోదరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒవైసీలు రేవంత్ రెడ్డి ముందు తమ ప్రాంత సమస్యలు చెప్పి.. కొన్ని కోరికలు కోరారు. ఏడు అసెంబ్లీ స్థానాలు పరిధిలో త్రాగునీటి సమస్య తీర్చేందుకు 500 కోట్ల నిధులు అడిగారు. బహుదూర్ పురలో , ఇంటర్ కళాశాల, డిగ్రీ..ఇంజనీరింగ్ కళాశాల కావాలని ఒవైసీ సోదరులు అడిగారు.

ప్రతిభ కలిగిన క్రీడాకారులకోసం క్రీడా మైదానం కావాలని కోరిన ఒవైసీ సోదరులు.. చార్మినార్ పాదచారుల నడక ప్రాజెక్ట్ పూర్తిచేయాలని కోరారు. అలాగే ఓల్డ్ సిటీ లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి కావాలని ఒవైసీ సోదరులు కోరారు. ఆరు నెలలకు ఓ సారి అయినా సీఎం రేవంత్ పాత బస్తీ లో పర్యటన చేయాలని కోరిన ఒవైసీ సోదరులు.. లాల్ దర్వజ ఆలయంకు నిధులు మంజూరు అయినా పనులను ప్రారంభం చేయలేదని సీఎం దృష్టికి తెచ్చారు. న్యూ సిటీ తో పాటు ఓల్డ్ సిటీ మరింత అభివృద్ధి కావాల్సి ఉందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: