రాష్ట్రంలో 1,66,41,489 మంది పురుష ఓటర్లు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 1,68,67,735 మహిళా ఓటర్లు ఉన్నారు.
అంటే పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే 2 లక్షల వరకూ ఎక్కువన్నమాట. ఇక తెలంగాణ రాష్ట్రంలో 2,829 థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. సవరణ తర్వాత తుది ఓటర్ల జాబితా ప్రకటించిన సీఈవో సుదర్శన్ రెడ్డి.. రాష్ట్రంలో 18-19 సంవత్సరాల ఓటర్లు 5,45,026 ఉన్నట్టు తెలిపారు.
రాష్ట్రంలో 85 సంవత్సరాలు దాటిన సీనియర్ ఓటర్లు 2,22,091 మంది ఉన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎన్ఆర్ఐ ఓటర్లు 3,591 మంది ఉండగా.. దివ్యాంగ ఓటర్లు 5,26,993 మంది ఉన్నారు. శేరిలింగంపల్లిలో అత్యధికంగా 7,65,982 ఓటర్లు ఉండగా.. అతి తక్కువగా భద్రాచలంలో 1,54,134 ఓటర్లు మంది ఓటర్లు ఉన్నట్టు తేలింది.