అలాగే నీటి భద్రత కు ప్రాధాన్యత ఇస్తామన్న సీఎం చంద్రబాబు.. జూన్ లోపు హంద్రీనీవా జలాలు పాలారు వాగుకు తెస్తామన్నారు. పాలారువాగుపై చెక్ డ్యాం నిర్మాణం చేపడతామన్నారు. గోదావరి జలాలను రాయలసీమకు తీసుకురావడానికి రూ.80 వేల కోట్ల తో తెస్తామన్నారు.
భూమిని జలాశయం గా మార్చే ప్రయత్నం చేస్తామన్నారు.
వర్షాకాలానికి ముందే 8 మీటర్ల భూగర్భజలాలు ఉండేలా చర్యలు ఉంటాయన్న సీఎం చంద్రబాబు.. అధికంగా పడిన వర్షాలను సద్వినియోగం చేశామన్నారు. 73 శాతం జలాశయాల్లో నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకొన్నామని.. రైతులకు వ్యవసాయ యంత్రాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
సౌర విద్యుత్ ఉత్పత్తి కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని.. కరెంటు బిల్లులు తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నామని.. స్వచ్ఛ కుప్పం ద్వారా పారిశుద్ధ్యం మెరుగుపరిచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని సీఎం చంద్రబాబు అన్నారు.
వీలైనంత త్వరలో స్వచ్ఛ కుప్పం చేయాల్సిన బాధ్యత మీపై ఉందన్న చంద్రబాబు... సాంకేతికతను అందిపుచ్చుకుని అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామన్నారు.