మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ ఏర్పాటు అయిందన్న రేవంత్ రెడ్డి.. పాతబస్తీలో కొత్త నిర్మించిన ఫ్లైఓవర్ కి మన్మోహన్ సింగ్ పేరు పెట్టామని గుర్తు చేశారు. జనవరి 26 రైతు భరోసా ఇస్తున్నాం.. రైతు కూలీలకు యేడాది 12 వేలు అందిస్తాం.. కొత్త రేషన్ కార్డ్ లు ఇవ్వబోతున్నాం.. యేడాది లో 55143 ఉద్యోగాలు ఇచ్చాం..21 వేల కోట్ల రుణమాఫీ చేశాం.. యేడాది లో 54 వేల కోట్లు రైతుల సంక్షేమం కోసం ఖర్చు చేశాం...500 రూపాయల కే సిలిండర్ ఇస్తున్నామని పీఏసీ సమావేశంలో రేవంత్ రెడ్డి తెలిపారు.
200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.. మహిళలకు ఆర్టీసీ లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాం...ఇప్పటి వరకు 4000 కోట్లు ప్రభుత్వం ఆర్టీసీ కి చెల్లించింది...త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్నాం... ప్రభుత్వ కార్యక్రమాలను కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని రేవంత్ రెడ్డి అన్నారు. మరి ఈ ప్రోగ్రెస్ రిపోర్టుతో రాహుల్ గాంధీ సంతృప్తి చెందుతారో లేదో చూడాలి.