తిరుపతి తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ అనుమానాలు వ్యక్తం చేయడం చర్చనీయాంశం అవుతోంది. కావాలనే కొందరు ఈ ఘటన జరిగేలా చేశారా అన్న అనుమానాలు వస్తున్నాయని నిన్న పవన్ కల్యాణ్ బాహాటంగానే అన్నారు. ఇది కావాలని చేశారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి.. పోలీసుల్లో కొందరు కావాలని చేశారా అనే అనుమానాలు ఉన్నాయి.. ఈ అనుమానాలపైనా విచారణ జరగాల్సి ఉందని పవన్‌ కల్యాణ్‌ కామెంట్ చేశారు.


ఈవో, అదనపు ఈవో, పాలకమండలికి మధ్య గ్యాప్‌ ఉందనే వాదన ఉందన్న పవన్‌.. ఆ గ్యాప్‌ తగ్గించుకోవాలన్నారు. ప్రత్యేకించి టీటీడీ అధికారి వెంకయ్య చౌదరిపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. తిరుపతిలోని పద్మావతి మహిళా వైద్య కళాశాల ఆస్పత్రికి వెళ్లిన పవన్‌ కల్యాణ్‌..
తోపులాట ఘటనలో అస్వస్థతకు గురైన బాధితులను పరామర్శించారు. అంతకు ముందు  పవన్ కల్యాణ్‌.. తొక్కిసలాట ప్రాంతానికి వెళ్లారు. బైరాగిపట్టెడలోని పద్మావతి పార్కును  పరిశీలించారు. ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: