ఈ రోజు రైతన్నలు పండించిన ధాన్యాన్ని ఇళ్లకు తీసుకొచ్చి వారి ఇష్ట దైవాలకు నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకుంటారన్న మంత్రి నారాయణ.. నా గెలుపు కోసం 3600 మంది టిడిపి కార్యకర్తలు అహర్నిశలు శ్రమించి 74వేల భారీ మెజారిటీతో గెలిపించారు. ప్రతి పండుగ నా కార్యకర్తలు ఇళ్ల వద్ద జరుపుకుంటాననన్నారు.
నెల్లూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే క్రమంలో పార్కులను అభివృద్ధి చేస్తానని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగులు వేస్తున్నారని మంత్రి నారాయణ తెలిపారు.
వైసిపి ప్రభుత్వ నిర్వాకం వల్ల రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయిందన్న మంత్రి నారాయణ... పనులు చేసిన కాంట్రాక్టర్లకు సైతం డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నామన్నారు. సుమారు లక్ష కోట్ల రూపాయల చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన కోసం పరిశ్రమలను స్థాపించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని మంత్రి నారాయణ వివరించారు.