వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో పాల్గొనేందుకు ఈనెల 20 తేదీ నుంచి దావోస్ లో పర్యటించే ఏపీ సీఎం చంద్రబాబు బృందంలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో దావోస్‌లో మొత్తం 8 మంది సభ్యుల బృందం పర్యటించనుంది. ఈ టీమ్‌లో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ముఖ్యమంత్రి కార్యదర్శి కార్తికేయ మిశ్రా ఉన్నారు. వీరితో పాటు ముఖ్యమంత్రి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీకాంత్ బండారు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్,  పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్ ఉన్నారు.

ఇంకా ఈ బృందంలో ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు సీఈవో సాయి కాంత్ వర్మ, కుప్పం ఏరియా డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఏరియా అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్ కూడా ఉన్నారు. ఈ నెల 20 తేదీ నుంచి 24 తేదీ వరకూ సీఎం చంద్రబాబు నేతృత్వంలోనీ బృందం దావోస్ లో పర్యటించనుంది. దావోస్‌లోజరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో రాష్ట్రం లోని వనరులు, పెట్టుబడి అవకాశాలను సీఎం చంద్రబాబు బృందం వివరించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: