దావోస్, సింగపూర్ పర్యటనలపై సీఎం రేవంత్ రెడ్డి తాజాగా సమీక్ష నిర్వహించారు. ఈనెల 16 నుంచి 19 వరకు సింగపూర్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నారు. ఈనెల 20 నుంచి 22 వరకు దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉంటుంది. సింగపూర్ లో స్కిల్ యానివర్సిటీతో ఒప్పందాలు, పెట్టుబడులపై సంప్రదింపులు జరపనున్నారు. దావోస్ లో ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పాల్గొనున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటించబోతోంది.


గత దావోస్ పర్యటనలో ఒప్పందాల పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. తొలి ఏడాదిలో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానం అందరినీ ఆకర్షిస్తోందన్న సీఎం రేవంత్ రెడ్డి.. పెట్టుబడులకు గమ్య స్థానంగా తెలంగాణ అందరి దృష్టిని ఆకర్షిస్తుందని ఆకర్షిస్తోందన్నారు.


పెట్టుబడులకు రాష్ట్రంలో అనుకూలమైన వాతావరణముందన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఫ్యూచర్ సిటీగా హైదరాబాద్ సానుకూలతలను ప్రపంచ వేదికపై పరిచయం చేయాలని సూచించారు. తొలి ఏడాదిలోనే ప్రభుత్వ పథకాలు, అభివద్ది  రాష్ట్రాన్ని బలమైన ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టాయని  సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: