ఆహార భద్రతను అందించే కొత్త రేషన్ కార్డులకు సంక్రాంతి నాంది పలుకుతుందన్న సీఎం రేవంత్ రెడ్డి.. గూడులేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసే పథకానికి సంక్రాంతి నాంది పలుకుతోందన్నారు. ప్రతి సంక్షేమ పథకం అర్హులైన వారందరికీ చేరాలనేది నా సంకల్పమన్నారు.
వ్యవసాయం, ఉపాధి కల్పన, పారిశ్రామిక రంగాలన్నింటా రాష్ట్రం తిరుగులేని పురోగమనం సాధిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. స్వేచ్ఛా సౌభాగ్యాలతో ప్రజలందరూ సంతోషంగా తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా సంక్రాంతి పండుగ సంబురాలు జరుపుకోవాలన్న : సీఎం.. పతంగులు ఎగరేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని యువతను హెచ్చరించారు.