రేవంత్ రెడ్డి రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఏడాది యాసంగి సీజన్‌ పురస్కరించుకుని రైతుభరోసా పథకం కింద పెట్టుబడి సాయం పంపిణీ కొనసాగుతోంది. నిన్న రెండు ఎకరాల లోపు విస్తీర్ణం సాగులో ఉన్న భూములకు రైతుభరోసా పథకం నిధులు జమ మొదలైంది. 11,79,247.17 ఎకరాల భూములకు 8,65,999 మంది రైతులకు 7,07,54,84,664 రూపాయలు రైతుభరోసా సాయం అందజేయనున్నామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెల్లడించింది.


జనవరి 27వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 577 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు కింద రైతుభరోసా పథకం నిధుల సాయం జమ సాగింది. 9,48,332.35 ఎకరాల భూములకు 4,41,911 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 5,68,99,97,265 రూపాయలు జమ అయ్యాయి. ఈ నెల 5న ఎకరా లోపు 9,29,234.20 ఎకరాల విస్తీర్ణం భూములు సంబంధించి 17,03,419 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 5,57,54,07,019 రూపాయలు జమ చేశారు.


ఇలా మూడు విడతల్లో భాగంగా ఇవాళ్టి వరకు 30 లక్షల 56 వేల 814 ఎకరాల 32 కుంటల విస్తీర్ణం భూములకు రైతుభరోసా సాయం పంపిణీ సాగనుంది. మొత్తం 30 లక్షల 11 వేల 329 మంది లబ్ధిదారులకు 18 కోట్ల 34 లక్షల 8 వేల 948 రూపాయలు విడుదల చేసి జమ చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓ ప్రకటనలో వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: