ఫిబ్రవరి నెలాఖరు వరకు చూసి మార్చి నుంచి నగరంలో ఎక్కడిపనులు అక్కడే ఆపేస్తామని జీహెచ్ఎంసీ  కాంట్రాక్టర్లు హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వంపై జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. 13 నెలలుగా బిల్లులు చెల్లించకుండా తమపై ప్రభుత్వం అణిచివేత ధోరణిని అవలంభిస్తుందని జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు  మండిపడ్డారు. ఎన్నికల సమయంలో చేసిన పనులకు గ్రేటర్ లో ఒక మలక్ పేట నియోజకవర్గం మినగా మిగతా 14 నియోజకవర్గాల్లో బిల్లులు ఆపేశారని జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు  అసహనం వ్యక్తం చేశారు.


ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ కాంట్రాక్టర్లు పేరు ఎత్తగానే అధికారులు మండిపడుతున్నారని జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు  వాపోయారు. గత ప్రభుత్వంలో కంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మేలు జరుగుతుందన్న తమ ఆశలు గల్లంతయ్యాయని జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు  వాపోయారు. వేలల్లో ఉన్న కాంట్రాక్టర్ల సంఖ్య క్రమంగా వందల్లోకి చేరుతున్నారని జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు  ఆవేదన వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: