ఇటీవల ఏపీ సీఎం జగన్ నివాసంలో అగ్ని ప్రమాదం జరిగినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా ఎస్పీ సతీష్ కుమార్ స్పందించారు. జగన్ ఇంటి ముందు జరిగిన అగ్ని ప్రమాదం నేపధ్యంలో సిసి కెమెరా విజువల్స్ ఇవ్వాలని నోటీస్ ఇచ్చామని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. అదే విధంగా గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా వచ్చారా అనే విషయంలోనూ నోటీసులు ఇచ్చామని ఎస్పీ సతీష్ కుమార్ వివరించారు.



ఇతర సిసి కెమెరా విజువల్స్ లో ఆధారాలు దొరకలేదన్న ఎస్పీ సతీష్ కుమార్.. ఈ నేపధ్యంలోనే పార్టీ కార్యాలయంలోని సిసి కెమెరా విజువల్స్ తో పాటు ఎవరెవరూ ఆరోజు సమావేశానికి వచ్చారో తెలుసుకుందామని నోటీసులు ఇచ్చామని తెలిపారు.


రెండు సార్లు అగ్ని ప్రమాదం జరిగిందని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఫైర్ యాక్సిడెంట్ జరిగిన ఎదురుగా పార్టీ కార్యాలయం సిసి కెమెరాలు మాత్రమే ఉన్నాయిని ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. అందుకే విజువల్స్ ఇవ్వాలని నోటీసులు ఇచ్చామని ఎస్పీ సతీష్ కుమార్ వివరించారు. మరి ఇందులో ఏం మతలబు ఉందో తేలుతుందా..?

మరింత సమాచారం తెలుసుకోండి: