ఏపీ ప్రభుత్వంలో సీఎం చంద్రబాబుకు హైటెక్ సీఎంగా పేరుంది. గానీ ఆయన ప్రభుత్వంలో ఆ ముద్ర మాత్రం కనిపించట్లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఆయన ప్రభుత్వంలో ఫైళ్లు పేరుకు పోతున్నాయి.
జలవనరుల శాఖలో ఒక్కో  ఫైల్ క్లియరెన్స్ కు సగటున 50  రోజుల సమయం పడుతోంది. అదే హోం శాఖ లో కీలక ఫైళ్ళకు క్లియరెన్స్ కు సగటున 47  రోజుల సమయం పడుతోందని తెలుస్తోంది.

ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక్కో ఫైల్ క్లియరెన్స్ కు 30 రోజుల సమయం పడుతోందని అధికారుల లెక్కల్లోనే తేలంది. అలాగే ఐటిశాఖ , శాసనసభ వ్యవహారాల శాఖ ల కు సంబంధించి సగటున క్లియరెన్స్ కు 30 రోజుల సమయం పడుతోందట. కార్మిక శాఖలో 28 రోజులు, పాఠశాల విద్యలో  సగటున 26  రోజుల సమయం పడుతోందట.

ఇక కీలకమైన ఆర్ధిక,అటవీ శాఖల్లో ఒక్కో ఫైల్ క్లియరెన్స్ కు 9 రోజుల సమయం పడుతోందట. అలా రెవెన్యూశాఖ లో 11  వేల పైచిలుకు పెండింగ్ ఫైళ్లు ఉన్నాయట. పంచాయితీ రాజ్. గ్రామీణాభివృద్ధి శాఖలో 14 వేల ఫైళ్లు పెండింగ్ ఉన్నాయట. జలవనరుల శాఖలో 9 వేలు, హోమ్ శాఖ లో 7400  ఫైళ్లు, సాధారణ పరిపాలన శాఖ లో సుమారు 12 వేల ఫైళ్లు పెండింగ్ లో ఉన్నాయట.

ఈ స్థాయి లో ఫైళ్లు పెండింగ్ ఉండడం పై మంత్రులు కార్యదర్శుల సమావేశంలో సీఎం అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది. త్వరితగతిన ఫైళ్లు క్లియర్ చేయాలని సీఎం ఆదేశించారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

cbn