
మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో సమయ పాలన పై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. చంద్రబాబుతో మీటింగ్ కు కూడా మంత్రులు, అధికారులు లేటుగా వస్తున్నారట. పాపం ఆయన ముందే వచ్చి కూర్చున్నా.. వీళ్ల కోసం వెయిట్ చేయాల్సి వస్తోందట. నిన్న అలాగే జరిగిందట.
నిన్న సమావేశానికి 5 నిముషాలు ముందుగానే సీఎం చంద్రబాబు వచ్చినా మంత్రులు, అధికారులు రాలేదట. ముఖ్యమంత్రి వచ్చినా సమావేశానికి సరైన టైమ్ కు కార్యదర్శులు, మంత్రులు రాకపోవడంతో పాపం.. వారి కోసం 10 నిముషాల సేపు ఐదో బ్లాక్ లో సీఎం చంద్రబాబు వేచి ఉన్నారట.
దీంతో మండిన చంద్రబాబు ప్రజా వ్యవహారాల్లో సమయం పాటించకపోవటంపై అందరికీ క్లాస్ తీసుకున్నారట. ఇక నుంచి ఈ తరహా వ్యవహారాలను సహించబోమని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి.. స్మార్ట్ వర్క్ చేస్తూనే సమయ పాలన కూడా చేయాలని మంత్రులు, అధికారులకు స్పష్టం చేశారట. కొసమెరుపు ఏంటంటే.. ఓ మంత్రి ఆఖరుగా ఉదయం 11.43 నిముషాలకు తీరికగా వచ్చాడట.