![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/breaking/134/liquor809deff1-411e-492f-8658-27e344b2705b-415x250.jpg)
ఈ పెంపు ద్వారా ప్రభుత్వానికి రూ.100 -150 కోట్ల ఆదాయం వస్తుందన్న ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర..అదే సమయంలో రీటైలర్లకూ మార్జిన్ పెరుగుతుందన్నారు. త్వరలో నవోదయం కార్యక్రమం ద్వారా అక్రమ మద్యాన్ని అరికడతామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. వచ్చే ఏడాది నాటికి అక్రమ మద్య రహిత రాష్ట్రంగా ఏపీని మారుస్తామన్నారుఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర.
జగన్ ప్రభుత్వం మద్యం డిపోలను తాకట్టు పెట్టి తెచ్చిన అప్పుల్లో రూ.13 వేల కోట్లు చెల్లించాల్సి ఉందన్న ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర.. వైసీపీ హాయాంలో పెద్ద ఎత్తున మద్యం అక్రమాలు చేశారన్నారు. మద్యంలో జగన్ ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఒక్కోక్కటిగా సరిదిద్దుకుంటూ వస్తున్నామన్న ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర.. గతంలో మద్యం నకిలీ బ్రాండ్లతోనూ రాష్ట్రంలో విక్రయాలు జరిపారన్నారు.