బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ భాష తీరు బాగాలేదు... అధికారం పోయిందన్న అక్కసుతో మతి భ్రమించి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని ప్రభుత్వ విప్‌ రామచంద్రనాయక్ మండిపడుతున్నారు.  సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్, ఆయన కుటుంబానికి సిగ్గు, శరం లేకుండా పోయాయని ఆక్షేపించారు. అవినీతి డబ్బుతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ప్రభుత్వ విప్‌ రామచంద్రనాయక్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.


ముఖ్యమంత్రికి రోషం లేదని, ఆత్మహత్య చేసుకోవాలని కేటీఆర్  మతిభ్రమించి మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్‌ రామచంద్రనాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్ స్కాంలో కవిత తెలంగాణ పరువు తీసినందుకు సిగ్గుపడాలి... పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు రాకుండా ఓడిపోయినందుకు మీరు సిగ్గుపడాలని ప్రభుత్వ విప్‌ రామచంద్రనాయక్ ఎద్దేవా చేశారు.


ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా చేతులెత్తేసినందుకు మీరు సిగ్గుపడాలని ప్రభుత్వ విప్‌ రామచంద్రనాయక్ ఆరోపించారు. ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినప్పటికీ... ప్రభుత్వం ఆరు గ్యారంటీలు హామీ అమలు చేస్తోందని, స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కేటీఆర్‌ చేతకాని మాటలు మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్‌ రామచంద్రనాయక్ విమర్శించారు. ఖమ్మం జిల్లాలో మంత్రులు ఏకగ్రీవం చేసుకోవడానికి యత్నిస్తున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించడం అర్థరహితమని ప్రభుత్వ విప్‌ రామచంద్రనాయక్ కొట్టిపడేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: