జేఈఈ మెయిన్స్ మొదటి సెషన్ లో తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకులాల ప్రతిభా కేంద్రాల విద్యార్థులు సత్తా చాటారు. ముఖ్యంగా గౌలిదొడ్డి ప్రతిభా కేంద్రం నుంచే ఎక్కువ మంది అత్యధిక పర్సంటైల్ సాధించినట్టు సాంఘీక సంక్షేమ గురుకుల సొసైటీ సెక్రటరీ డాక్టర్ అలుగు వర్షిణి పేర్కొన్నారు.


ఆర్ మణిదీప్ అత్యధికంగా 99.031 పర్సంటైల్ సాధించగా... 28 మంది సాంఘీక సంక్షేమ గురుకులాల విద్యార్థులు 90కి పైగా పర్సంటైల్ సాధించినట్టు అలుగు వర్షిణీ ప్రకటించారు. 80 నుంచి 90 పర్సంటైల్ 111 మందికి , 128 మందికి 70 నుంచి 80 పర్సంటైల్ , 168 మంది 60 నుంచి 70 పర్సంటైల్ సాధించిన వారిలో ఉన్నారని  సాంఘీక సంక్షేమ గురుకుల సొసైటీ సెక్రటరీ డాక్టర్ అలుగు వర్షిణి పేర్కొన్నారు.


గురుకుల ప్రతిభా కేంద్రాల్లో మరింత మెరుగైన విద్యు అందించేందుకు బదిలీల ద్వారా అనుభవజ్ఞులైన బోధనా సిబ్బందిని తీసుకువచ్చామని సాంఘీక సంక్షేమ గురుకుల సొసైటీ సెక్రటరీ డాక్టర్ అలుగు వర్షిణి అన్నారు. మైక్రో షెడ్యూల్ ని రూపొందించి పటిష్టంగా అమలు చేయటంతోపాటు.... మాక్ పరీక్షల నిర్వహణ, విద్యార్థులకు అవసరమైన కౌన్సిలింగ్ ఇచ్చినట్టు అలుగు వర్షిణి ప్రకటనలో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: