చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్ పై దాడికి పాల్పడిన వీరరాఘవ రెడ్డి ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు. ఆయన్ను అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. ఆయనతో పాటు మరో 20 మంది వరకూ రంగరాజన్ పై దాడి కేసులో అరెస్టయ్యారు. అయితే.. తాజాగా వీర రాఘవ రెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు.

తన రిమాండ్‌ను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన వీర రాఘవ రెడ్డి.. తన వాదన వినిపిస్తున్నాడు. బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్ ఫిర్యాదు మేరకు వీర రాఘవ రెడ్డి పై కేసు నమోదైన సంగతి తెలిసిందే.
వీరరాఘవరెడ్డిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన మొయినాబాద్‌ పోలీసులు.. రిమాండ్ కు తరలించారు. అయితే రాజేంద్రనగర్‌ కోర్టు రిమాండ్ విధించడాన్ని సవాల్ చేసిన వీర రాఘవ రెడ్డి తరపున  న్యాయవాది నరేష్ వీరరాఘవరెడ్డి తరఫున వాదనలు వినిపించారు. ప్రాథమిక ఆధారాలు లేకున్నా రాజేంద్రనగర్ కోర్టు రిమాండ్‌ విధించిందని లాయర్‌ నరేష్.. వాదించగా.. పీపీకి నోటీసులు జారీ చేస్తూ విచారణను హైకోర్టు 14వ తేదీకి వాయిదా వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: