![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/breaking/134/caste-survey8642b2f5-ce2a-4ab5-9387-c6baececac63-415x250.jpg)
ప్రభుత్వం కుల గణన రీసర్వే పై ఆర్ కృష్ణయ్య హర్షం వ్యక్తం చేశారు. ఆధార్ లెక్క ప్రకారం రాష్ట్రంలో నాలుగు కోట్ల 10 లక్షల మంది లో బీసీల శాతాన్ని వెలికి తీయాలని ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు.. గత బీసీ కుల గణన సర్వే లో అనేకమంది పలు కారణాల రీత్యా తమ వివరాలను వెల్లడించలేదని ప్రస్తుతం ప్రభుత్వము అలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల, భాగాల సిబ్బంది చేత పటిష్టంగా కులగణనగ నిర్వహించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలని కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ఆర్ కృష్ణయ్య అన్నారు. ఈ ప్రధాన ఎజెండాతో ఈనెల 25వ తేదీన బెంగళూరులో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్టు ఆర్ కృష్ణయ్య వివరించారు. ప్రభుత్వం బీసీ కుల గణన పకడ్బందీగా నిర్వహించాలని బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు