![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/breaking/134/bhatti8ab2790f-d704-46fc-a4c7-d0e1b512f12e-415x250.jpg)
రెగ్యులర్ కోర్స్ లతో పాటు, ఒక కోర్స్ ఒకేషనల్ కోర్సులకు కేటాయించాలని.. అందుకు ఏర్పాట్లు చేసుకోవాలని భట్టి విక్రమార్క తెలిపారు. రెసిడెన్షియల్ పద్ధతిలో విద్యార్థులు పూర్తిగా అందుబాటులో ఉంటున్న నేపథ్యంలో ఒకేషనల్ కోర్సులు ప్రవేశపెడితే ప్రయోజనం ఉంటుందని భట్టి విక్రమార్క తెలిపారు. ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సుల కొనుగోలు.. వాటి నిర్వహణకు అవసరమైన ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటుపై సమావేశంలో చర్చించారు. ఆర్టీసీ ఆస్తులు.. నిర్వహణ, ఆదాయ వనరులపై సమావేశంలో చర్చించారు.
అద్దె భవనాల్లో కొనసాగుతున్న సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల అద్దె బకాయిలు వెనువెంటనే చెల్లిస్తాం, ప్రతిపాదనలు తీసుకురావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులకు స్పష్టంచేశారు. గురుకులాల్లో ఒకేషనల్ కోర్సులు ప్రవేశం పెట్టడం మూలంగా ఉపాధి లభించే అవకాశం ఉందని కొందరు మంత్రులు అభిప్రాయపడ్డారు.
సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో మరమ్మతులు చేపట్టాలి, కిటికీలు, ప్రధాన ద్వారాలు కూడా దోమతెరలు ఏర్పాటు చేయాలని అందుకు అవసరమైన నిధులు వెంటనే కేటాయిస్తామని మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్లు తెలిపారు.