క్షయ.. ఈ వ్యాధితో ఏటా వేల మంది మరణిస్తున్నారు. ఇంకా ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగానే ఉంది. అందుకే క్షయ బాధితులకు ప్రభుత్వం ఎప్పడు అండగా ఉంటుందని.. క్షయ రహిత తెలంగాణ సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ పేర్కొన్నారు. క్షయ వ్యాధి బారినపడిన బాధితుల చికిత్స కోసం క్షయ మిత్రా కార్యక్రమంలో భాగంగా సీఎస్ఆర్ నిధులు అందించిన 8 ఫార్మాసంస్థలన ప్రతినిధులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ అభినందించారు.


రాష్ట్రవ్యాప్తంగా 9 జిల్లాల్లోని క్షయ బాధితులకు ఆయా ఫార్మా కంపెనీలు 2.8కోట్లతో న్యూట్రిషన్ కిట్స్ అందిస్తున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ తెలిపారు. మినిస్టర్స్ క్వార్టర్స్ లోని మంత్రి నివాసంలో జరిగిన కార్యక్రమంలో  వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్ వి కర్ణన్, డ్రగ్స్  కంట్రోల్ అథారిటీ డైరెక్టర్ జనరల్ కమల్ హాసన్ రెడ్డి, టీబీ కంట్రోల్ డిప్యూటీ డైరెక్టర్ డా. రాజేశం సహా పలువురు ఉన్నత అధికారులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా మాట్లాడిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ..  క్షయ వ్యాధి బాధితులకు ప్రభుత్వం నుండి ఉచితంగా మందులు,   చికిత్స కోసం  ప్రతినెలా వెయ్యి రూపాయల నగదును అందిస్తున్నామన్నారు.  క్షయ వ్యాధి నిర్మూలనకు గ్రామస్థాయిలో  అవగాహన కార్యక్రమాలను, యాక్టివ్ కేస్ ఫైండింగ్ క్యాంపులను నిర్వహిస్తున్నామన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ...  ప్రభుత్వం నిర్దేశించిన వంద రోజుల క్షయ నివారణ కార్యక్రమాలను 9 జిల్లాల్లో కొనసాగిస్తున్నట్టు వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: