![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/breaking/134/modifc0551fd-3c32-46ed-8748-ae55bcac313f-415x250.jpg)
దీన్నుంచి తప్పించుకోవడానికి, మీరు మోదీ గారిమీద విమర్శలు చేస్తున్నారని... మీ అసమర్థతమీద చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ నేతలు అంటున్నారు. ఎన్నికల వాగ్దానం సందర్భంగా.. ఐదేళ్లకు లక్షకోట్లు, ఏడాదికి 20వేల కోట్ల బడ్జెట్ ఇస్తామని అని.. ఎంతవరకు పూర్తిచేశారో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని బీజేపీ నేతలు అన్నారు. ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపోలేక.. మోదీ గారి తక్కువ చేసి తప్పించు కుందామనుకుంటున్నారు..ఇదేనా మీ చిత్త శుద్ధి అని బీజేపీ నేతలు విమర్సించారు.
తెలంగాణలో బీసీల పురోగతికోసం రాష్ట్ర బడ్జెట్ లో రేవంత్ సర్కారు ఎంత కేటాయించింది?.. ఎంత విడుదల చేసింది? ఒక్కటంటే ఒక్క బీసీ వర్గమైనా మీ పాలనలో సంతోషంగా ఉన్నారా? ఇదేనా మీ చిత్త శుద్ధి.. నామినేటెడ్ పోస్టుల విషయంలోనూ బీసీలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? 75 ఏళ్లో ఒక్క బీసీనైనా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని చేసిందా.. అని బీజేపీ నేతలు విమర్శించారు.
తెలంగాణలో అధికారంలోకి వస్తే.. బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన పార్టీ బీజేపీ.. అనవసరంగా బీజేపీపై, మోదీ గారిపై విమర్శలు చేస్తే.. ప్రజలు ఊరుకోరు.. మోదీ గారిని విమర్శిస్తే బీసీ సమాజమే సరైన బుద్ధి చెబుతుందని బీజేపీ నేతలు అంటున్నారు.