వ్యవసాయ, చేనేత, హస్తకళల శాఖల బడ్జెట్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఇందులో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో సమావేశమయ్యారు. ఉద్యాన పంటల విస్తీర్ణం పెంపుపై దృష్టి సారించాలని అధికారులకు మంత్రుల ఆదేశం ఇచ్చారు. పూలు, కూరగాయలు, ఆయిల్ ఫాం వంటి ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రులు అన్నారు.


జల వనరుల సంరక్షణతో పాటు పంట ఉత్పత్తులు పెరిగేందుకు ఉపయోగపడే డ్రిప్పు, స్ప్రింకర్లను రైతులకు రాయతీపై అందించాలన్న మంత్రులు.. చేనేత కార్మికులకు రాయతీపై నూలు, విద్యుత్ సౌకర్యం వంటి పథకాలు కొనసాగించాలని మంత్రుల ఆదేశాలిచ్చారు. టెక్స్ టైల్ పార్కుల అభివృద్ధికి కావలసిన చర్యలు చేపట్టాలన్న మంత్రులు.. తగిన చర్యలు తీసుకోవాలన్నారు.


రైతులు, చేనేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  అన్నారు. వ్యవసాయ రంగానికి గత బడ్జెట్లో పెద్ద మొత్తంలో కేటాయింపులు చేశాం, ఆ విధానాన్ని కొనసాగిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  అన్నారు. ఆరు గ్యారెంటీల్లో భాగంగా పెట్టుబడి సాయంగా అందిస్తున్న రైతు భరోసాను కొనసాగిస్తాం, బడ్జెట్లో ఆ మేరకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: