![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/breaking/134/telangana0738dc72-c61d-4b44-9465-ce0b08be2066-415x250.jpg)
తెలంగాణ కోసం లండన్ తరహాలో ఒక మంచి మ్యూజియం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆలోచించాలని మాజీ ఎంపీ దేవేందర్ గౌడ్ అంటున్నారు. సచివాలయం వెనకాల ఈ మ్యూజియం ఏర్పాటు చేసి చరిత్ర తెలిపేల ఏర్పాటు చేయాలని మాజీ ఎంపీ దేవేందర్ గౌడ్ సూచించారు. విజయ తెలంగాణ పుస్తక ఆవిష్కరణ సభలో మాట్లాడిన మాజీ ఎంపీ దేవేందర్ గౌడ్.. శాతవాహనులు కోటి లింగాల నుంచి దక్షిణ భారత దేశం మొత్తం పాలించారని..కీసర గుట్టను కేంద్రం గా చేసుకుని విష్ణు కుండునులు పాలించారని.. వరంగల్ నుంచి కాకతీయులు పాలించారని గుర్తు చేశారు.
నిజాం లు పాలించింది కింత కాలం మాత్రమేనన్న మాజీ ఎంపీ దేవేందర్ గౌడ్.. నిజాం కాలంలో రైతుల నుంచి బలవంతంగా సిస్తూ వసూలు చేసే వారని మా తండ్రి చెప్పారని గుర్తు చేశారు. మ్యూజియం అటానామాస్ బాడీగా ఉండేలా చూడాలని.. హుస్సేన్ సాగర్ హైదరాబాద్ కి వరంలాంటిది. అక్కడ టూరిజం ని ఇంకా అభివృద్ధి చేయాలని మాజీ ఎంపీ దేవేందర్ గౌడ్ సూచించారు.