విభజన సమయంనాటికి మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ అన్న సంగతి తెలిసిందే.. అయితే.. తెలంగాణ ఆర్థిక పరిస్థితులపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. దేశ ఆదాయంలో 85 శాతం అప్పులు చేస్తున్న మీరా తెలంగాణ గురించి మాట్లాడేదన్న మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య.. తెలంగాణ ఆదాయంలో 26 శాతం అప్పులే ఉన్నాయన్నారు.



దేశంలో పన్నెండు ప్రధాన రాష్ట్రాల కన్నా తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగుందన్న మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య .. తెలంగాణ కు చేసిన చిన్న చిన్న పనుల గురించి సీతారామన్ గొప్పగా చెప్పుకుంటున్నారని అన్నారు. రాష్ట్రాలకు ఇచ్చే నిధులు తక్కువ చేశారు... ఇదేనా చేసిన గొప్ప?.. రాష్ట్రపతి ప్రసంగంలో పక్క రాష్ట్రం గురించి మాట్లాడి తెలంగాణను విస్మరించారు.. బడ్జెట్ లో తెలంగాణ గురించి ఒక్క మాటైనా చెప్పారా ?.. విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలు పదేళ్లుగా విస్మరించి... ఇవాళ తెలంగాణ అభివృద్ధిని తక్కువ చేసి మాట్లాడటం సిగ్గుచేటు.. నిర్మలా సీతారామన్ రాజకీయాలు చేస్తే మేము కూడా రాజకీయాలు చేస్తాం.. తెలంగాణపై విషం చిమ్మే మాటలు ఇప్పటికైనా మానుకోవాలని పొన్నాల లక్ష్మయ్య సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: