
ఫార్ములా ఈ రేస్ కేసు లో కేటీఆర్ ఎప్పుడు జైలు కు పోతాడో చెప్పాలన్నారు. నలభై ఏళ్లు రాజకీయాల్లో ఉండి చిన్న అమ్మాయి చేతిలో చిత్తు గా ఓడిపోయినా సిగ్గు రాలేదా అని ప్రశ్నించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.. బీఆర్ ఎస్ లో ఉన్న ఎర్రబెల్లి కి కాంగ్రెస్ విషయాలు ఎలా తెలుస్తున్నాయని ప్రశ్నించారు.
మా ఎమ్మెల్యేలు గురించి ఎర్రబెల్లి ఆలోచించాల్సిన అవసరం లేదు... ఇప్పటికే మీ వాళ్లు10 మంది పోయారు. మిగిలిన వారినైనా కాపాడుకో... సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన ను ఓర్వలేకనే ఎర్రబెల్లి విమర్శలు.. కులగణన, ఎస్సీ వర్గీకరణ ఒకే సారి చేసిన ప్రభుత్వం మాది.. మా ప్రభుత్వం స్థిరంగా ఉంది..
అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం.. బండి సంజయ్ కేంద్ర మంత్రి హోదాలో ఉండి రాహుల్ గాంధీ పైన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు.. మోదీ కులం పైన సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడా చులకన గా మాట్లాడలేదు.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బండి సంజయ్ వక్రీకరించి మాట్లాడుతున్నాడని ఆది శ్రీనివాస్ విమర్శించారు.