
తిరుమల కల్తీ నెయ్యి కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రెండో రోజు సిట్ విచారణ అంతా ఉత్తరాఖండ్ లోని భోలేబాబా డైరీ చుట్టూ సాగింది. అక్రమ మార్గంలో టీటీడీకి నెయ్యి సరఫరా చేసేందుకు భోలేబాబా డెయిరీ చేసిన ప్రయత్నాలపై సిట్ విచారణ జరిపింది. వైష్ణవీ, ఏఆర్ డెయిరీ లతో ఉన్న సంబంధాలపై దృష్టి సారించింది. అర్హత లేకున్నా టిటిడి నిర్వహించిన టెండర్లలో ఏఆర్ డెయిరీ పాల్గొన్న తీరుపై వివరాలు సేకరించింది.
ఏఆర్ డెయిరీ ద్వారా బోలేబాబా డెయిరీ నెయ్యి సరఫరాపై.. ఏఆర్ డెయిరీ కి టెండర్ ఈఎండీ మొత్తం భోలేబాబా డెయిరీ సమకూర్చడం పై విచారణ జరిపింది. ఈఎండీ మొత్తాన్ని బదిలీ చేసిన ఖాతాల వివరాలు బ్యాంక్ లావాదేవీలపై సిట్ ఆరా తీసింది. ఏఆర్ డెయిరీ ద్వారా కల్తీ నెయ్యి సరఫరా కుట్ర పై విచారణ జరిపింది. కల్తీ నెయ్యి సరఫరాలో బోలెబాబా డెయిరీ కీలకంగా గా భావిస్తున్న సిట్.. టెక్నికల్ బిడ్ సమయంలో టిటిడి కొనుగోలు విభాగం వ్యవహరించిన తీరుపై ఆరా తీసింది. నెయ్యి కొనుగోలులో మార్కెటింగ్ విభాగ వైఫల్యాలపై టీటీడీ అధికారులను విచారించనున్న సిట్.. అసలు వాస్తవాలు వెలుగులోకి తీసుకురానుంది.