
ఏపీ సీఎం చంద్రబాబు తన భార్యపై ప్రశంసల వర్షం కురిపించారు. ఎన్టీఆర్ లాగే.. భువనేశ్వరి మొండిఘటం..అంటూ కితాబిచ్చారు. హెరిటేజ్‌ను సమర్థవంతంగా నడిపించడమే కాదు.. ఎన్టీఆర్ ట్రస్ట్‌ను కూడా అంతే గొప్పగా నడిపించే శక్తి నారా భువనేశ్వరికి ఆమె తండ్రి నుంచి వచ్చిందని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
సమాజానికి తిరిగిస్తేనే.. జీవితానికి సార్థకత ఉంటుందన్న ఏపీ సీఎం చంద్రబాబు .. పేదరికం, ఆరోగ్యం, విద్య సమస్యలు వేధిస్తున్నాయి.. సమస్య ఎక్కడుంటే.. ఎన్టీఆర్ అక్కడుండేవారు.. అవనిగడ్డలో తుఫాను.. రాయలసీమ కరువొస్తే జోలెపట్టారు.. ఆయన స్ఫూర్తితోనే అందరం ముందుకెళ్లాలి.. బాధలోంచే ఎన్టీఆర్ ట్రస్ట్, బసవతారకం హాస్పిటల్ పుట్టాయి.. తలసీమియా చిన్నారులకు అండగా నిలిచోళ్లందరికీ సెల్యూట్.. పవన్ కల్యాణ్ రూ.లక్ష టిక్కెట్ తీసుకోకుండా.. రూ.50లక్షలు ట్రస్ట్‌కు విరాళంగా ఇచ్చారు.. సాయం చేయాలనే ఆయనలాంటి గొప్ప మనసు అందరికీ ఉండాలి అన్నారు.