అమరావతిలో తలసీమియా కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నామని నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. తలసీమియా బాధిత చిన్నారులకు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఎనిమిది పడకల కేర్‌ సేంటర్‌ను ఏర్పాటు చేసి 250మంది చిన్నారులకు ఉచిత వైద్యమందిస్తున్నామని తెలిపిన నందమూరి బాలకృష్ణ పడకల సంఖ్యను మరో 25కు ప్రస్తుతం పెంచుతున్నామన్నారు.


ఎన్టీఆర్‌ మెమోరియల్‌్ ట్రస్ట్, బసవతారకం కేన్సర్‌ ఆసుపత్రి, విద్యాలయాల ద్వారా సమాజానికి మావంతు సేవలందిస్తున్నామని తెలిపిన నందమూరి బాలకృష్ణ..  తలసీమియా బాధిత చిన్నారుల కోసం ఇలాంటి అద్భుతమైన కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. బాధిత చిన్నారులు జీవితాంతం రక్తమార్పిడిపై ఆధారపడాల్సి వస్తోందని నందమూరి బాలకృష్ణ తెలిపారు.


రక్తమార్పిడికి ప్రతి నెలా రూ.12-14వేలవుతోందన్న నందమూరి బాలకృష్ణ..  హైదరాబాద్‌లోనే 3,500మంది బాధిత చిన్నారులున్నారని తెలిపారు. తలసేమీయా చిన్నాలరు సాయం కోసం ఎన్టీఆర్ ట్రస్టు యుఫోరియా పేరుతో మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి వచ్చే నిధులను తలసేమియా చిన్నారుల సాయం కోసం వినియోగించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: