గుంటూరు జీజీహెచ్ లో గులియన్ బ్యారీ సిండ్రోమ్ తో ఓ మహిళ మృతి చెందారు. ఏపీలో గులియన్ బ్యారీ సిండ్రోమ్ మరణం నమోదు కావడం ఇదే తొలిసారి. ప్రకాశం జిల్లాకు చెందిన కమలమ్మ ఈ నెల 3 తేదీన జీజీహెచ్ కు వచ్చారు.దాదాపు 2 వారాలుగా ఆమెకు వైద్యులు మెరుగైన చికిత్స అందించారు.  కమలమ్మకు రెండుసార్లు కార్డియాక్ ఆరెస్ట్ సమస్య వచ్చింది. మరోమారు ఈ కార్డియాక్ సమస్య రావడంతో ఈ రోజు మృతి చెందారు

మరో బాధితురాలు జీజీహెచ్ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మరో వ్యక్తి పరిస్థితి మెరుగుపడింది. జీబీఎస్ వ్యాధి గురించి అనవసరమైన ఆందోళన వద్దని జీజీహెచ్ సూపరింటెండ్ తెలిపారు. ఈ వ్యాధి వచ్చిన వారిలో మరణాలు 5 శాతం లోపే ఉందని.. జీబీఎస్ వ్యాధి బాధితులకు జీజీహెచ్ లో అత్యుత్తమ వైద్యం అందిస్తున్నామని.. ప్రజలు వ్యాధి పట్ల అవగాహన పెంచుకుని అప్రమత్తంగా ఉంటే మంచిదని ఆయన వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

gbs