చివరి ఆయకట్టుకు నీరు చేరాలంటే హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులు అవసరం. కానీ.. తాజాగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి లైనింగ్ పనులు ఆపాలని ప్రెస్ మీట్ లో చెప్పారని
మడకశిర ఎమ్మెల్యే ఎం. ఎస్. రాజు  అంటున్నారు. లైనింగ్ పనులను రైతులతో కలిసి అడ్డుకుంటామని చెప్పటం ఏంటి.. రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉందా.. అని మడకశిర ఎమ్మెల్యే ఎం. ఎస్. రాజు  నిలదీశారు.


వైసీపీలో రైతుల కోసం ఒక్క పని చేసిన పాపాన పోలేదు... జగన్ ఒక్క పిల్ల కాలువ కూడా తవ్వించలేదు .. రైతుల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు.. రాప్తాడులో ఉనికిని కాపాడుకోవటానికి ప్రకాష్ రెడ్డి  నాటకం ఆడుతున్నారు.. మీరంతా రైతు ద్రోహులుగా మిగిలిపోతారని మడకశిర ఎమ్మెల్యే ఎం. ఎస్. రాజు  అన్నారు.


మిమ్మల్ని రైతులు నమ్మే పరిస్థితి లేదు.. లక్షల ఎకరాలకు నీరు ఇచ్చి, రైతుల సంక్షేమం కోసం చంద్రబాబు కృషి చేస్తున్నారు.. తప్పు చేసిన నాయకులు ఎవరైనా చట్టం ముందు శిక్ష అర్హులు.. వంశీ అరెస్ట్ అలాంటిదే...ఇది కక్ష సాధింపు కాదు... కక్ష సాధింపు అయితే గతంలో విర్రవీగినా అనేకమందిని టార్గెట్ చేయాలి.. మా ప్రభుత్వం అలాంటి చర్యలకు పాల్పడదు.. అధికార అహంతో గతంలో తప్పు చేసిన ప్రతి ఒక్కరూ చట్టం ప్రకారం శిక్ష అనుభవించాల్సి ఉందని మడకశిర ఎమ్మెల్యే ఎం. ఎస్. రాజు  అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: