
ఇసుక అక్రమ రవాణపై ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించి పలు ఆదేశాలు ఇచ్చారు. ఇసుక బ్లాక్ మార్కెట్‌ను అరికట్టి పేదలకు ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇసుక అక్రమ రవాణకు అడ్డుకట్ట వేసే బాద్యత జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలకు.. హైదరాబాద్ పరిసరాల్లో హైడ్రాకు అప్పగించారు. ఇసుక రీచ్‌ల వద్ద 360 డిగ్రీల కెమెరాలు, సోలార్ లైట్స్ ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించారు.
ఇసుక స్టాక్ యార్డుల వద్ద కట్టుదిట్టమైన ఫెన్సింగ్ తో పాటు ఎంట్రీ, ఎగ్జిట్ లు ఏర్పాటు చేయాలని సూచించారు. రవాణకు సంబంధించి రిజిస్టర్డ్ లారీలను ఎంప్యానెల్ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇసుక అక్రమ రవాణ జోరుగా సాగుతున్నాయన్న ప్రచారంతో తాజాగా ముఖ్యమంత్రి మరోసారి ఆదేశించారు.