ఇక ఇప్పుడు డ్రోన్ల రాజ్యం నడుస్తోంది. ఇటీవల భారత మిలట్రీ నిర్వహించిన డ్రోనతాన్ లో మొదటి స్థానంలో నిలిచిన 200 కేజీల పే లోడ్ మోసుకెళ్లగలిగే అధునాతన డ్రోన్ ను మాగెల్లాన్ క్లౌడ్ సంస్థ హైదరాబాద్ లో ఆవిష్కరించింది. మరికొద్ది రోజుల్లోనే ఇది అందుబాటులోకి వస్తుందని సంస్థ సీఈఓ జోసెఫ్ సుధీర్ తెలిపారు.


ఏఐ ను ఉపయోగిస్తూ ఈ సర్వైలెన్స్,  స్కానలిటిక్స్, డీప్ టెక్ సొల్యూషన్స్ వంటివి తమ సంస్థ తయారు చేస్తోందని సీఈఓ  జోసెఫ్ సుధీర్ తెలిపారు. తమ సంస్థ స్టాక్ ఎక్చేంజీలో లిస్ట్ అయిందని ఆయన ప్రకటింటారు.  తెలంగాణలో అధునాతన వీడియో అనలిటిక్స్ సిస్టంలను అభివృద్ధి చేసేందుకు తోడ్పడుతామని తెలిపారు. 1600 మంది ఉద్యోగులు తమ సంస్థలో పని చేస్తున్నారని 2026 కల్లా 5వేల మందికి ఉద్యోగాలను సృష్టించటమే లక్ష్యమని ఆయన చెప్పారు.  


రెండేళ్లలో లాజిస్టిక్స్, సర్వైలెన్స్, వ్యవసాయం తదితర రంగాలకు సంబంధించి 17 కి పైగా ఉత్పత్తులను తయారు చేశామని దానిలో భాగంగా వచ్చిన కార్గోమాక్స్ 20KHC ఆవిష్కరించామని తెలిపారు. దేశం నిర్దేశించుకున్న  లక్ష్యాన్ని సాధించటంలో తమ వంతు పాత్ర పోషిస్తామని సీఈఓ  జోసెఫ్ సుధీర్  తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: