యాభై ఏళ్ల విప్లవ విద్యార్థి ఉద్యమ ప్రస్థానం పేరుతో తొలి, మలితరం విద్యార్థులు సదస్సును హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. ఈ నెల 20, 21 తేదీల్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రం వేదికగా ఈ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు సంబంధించిన వాల్ పోస్టర్లను సోమాజీగూడ ప్రెస్‌ క్లబ్ లో ఎమ్మెల్సీ కోదండరాం, పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హారగోపాల్‌ ఆవిష్కరించారు.


విద్యార్థి ఉద్యమంలో పాల్గొన్న జ్ఞాపకాలు విలువైనవని పౌర హక్కుల నేత ప్రొఫెసర్‌ హారగోపాల్‌ అన్నారు. విద్యార్థి ఉద్యమంలో పనిచేసిన వాళ్లు అనేక రంగాల్లో స్థిరపడ్డారని తెలిపారు. విద్యార్థి ఉద్యమ జ్ఞాపకాలు,  ఆ నాటి సామాజిక సందర్భం, చరిత్ర, విద్యార్థుల ఆశయాలు, ఆదర్శాలు, త్యాగాలను గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 20, 21 తేదీల్లో జరిగే సదస్సుకు పూర్వ విద్యార్ధులు తరలిరావాలని ఎమ్మెల్సీ ఆచార్య కోదండరాం పిలుపునిచ్చారు. డబ్బుల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ou