తెలంగాణలో రైతులు ఇబ్బంది పడకుండా, పంటలు ఎండిపోకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాబోయే మూడు నెలలు అత్యంత కీలకమన్న రేవంత్ రెడ్డి... రాష్ట్రమంతటా అన్ని ప్రాంతాల్లో సాగు, తాగు నీరు, విద్యుత్తు డిమాండ్ గణనీయంగా పెరుగుతుందని తెలిపారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా తాగు, సాగునీటిని అందించేందుకు జిల్లా కలెక్టర్లు ప్రత్యేక చొరవ చూపాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.


వెంటనే సంబంధిత అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని జిల్లాల వారీగా ప్రణాళికలు తయారు చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. నాగార్జున సాగర్, ఎస్సారెస్పీ ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టు పంటలు, నీటి విడుదలపై ఆయా జిల్లాల కలెక్టర్లు సంబంధిత నీటిపారుదలశాఖ ఇంజనీర్లతో వెంటనే సమీక్ష నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.


ప్రాజెక్టులు, కాల్వలు, ఆయకట్టులో పంటలు, నీటి విడుదల తీరును కలెక్టర్ల స్వయంగా పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. నిర్ణీత ఎజెండా ఖరారు చేసుకొని అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి, తగిన ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: