ఇటీవల తీర్థయాత్రల కోసం కూడా రైల్వే శాఖ ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తోంది. ఇందు కోసం ఏర్పాటు చేసిన భారత్ గౌరవ్ రైళ్లకు విశేష ఆదరణ లభిస్తోంది. తాజాగా మొట్టమొదటిసారిగా చార్ థామ్ యాత్రకు భారతీయ రైల్వే శ్రీకారం చుట్టింది. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో మేలో చార్ థామ్ యాత్రను తలపెట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. జీఎంవీఎన్, భారతీయ రైల్వే, టూర్స్ టైమ్స్ సంయుక్త ఆధ్వర్యంలో చార్ థామ్ యాత్రను ప్రవేశపెట్టారు.


మే 8వ తేదీ నుంచి మే 23వ తేదీ వరకు 16 రోజులపాటు చార్ థామ్ యాత్ర కొనసాగుతుంది. గర్ వాల్ మండల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, టూర్ టైమ్స్ ఆధ్వర్యంలో మొదటిసారిగా చార్ థామ్ యాత్రను ప్రారంభిస్తున్నామని టూర్స్ టైమ్స్ తెలంగాణ, ఏపీ రీజనల్ ఇంచార్జ్ రమేష్ అయ్యంగర్ తెలిపారు. హరితప్లాజాలో నిర్వహించిన మీడియా సమావేశంలో చార్ థామ్ యాత్ర విశేషాలను ఆయన వెల్లడించారు.


హరిద్వార్, యమునోత్రి, గంగోత్రి, కేదరీనాథ్, భధ్రీనాథ్ లను కవర్ చేస్తూ 16 రోజుల యాత్రను తలపెట్టామన్నారు. ఈ యాత్రకు ఫస్ట్ ఏసీకి ఒక్కొక్కరికి రూ.82,500లు, సెకండ్ ఏసీకి ఒక్కొక్కరికి రూ.75,500లు, థర్డ్ ఏసీకి ఒక్కొక్కరికి రూ.70,500లు ప్యాకేజీలుగా నిర్ణయించామన్నారు. ప్రతి కోచ్ లో సీసీ కెమెరాలు, టూర్ మేనేజర్, హౌస్ కీపింగ్ కు సంబంధించిన వ్యక్తులు, సెక్యూరిటీ సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రయాణికులు సౌకర్యవంతంగా యాత్రను పూర్తిచేసేవిధంగా డిజైన్ చేశామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: